కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రాహుల్ గాంధీ కి మద్దతుగా జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర (Bharat Jodo Yatra) పలు రాష్ట్రాలను దాటుకొని ధేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి చేరుకుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగ బంధానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
“నేను ఆమె నుండి పొందిన ప్రేమను దేశంతో పంచుకుంటున్నాను” అని అంటూ క్యాప్సన్ ఇచ్చాడు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) బిజీగా ఉన్న రాహుల్ ను చూడగానే సోనియా గాంధీ ఎమోషన్ అయ్యారు. తన కుమారుడు రాహుల్ ను అక్కున చేర్చుకొని తన ప్రేమను వ్యక్తం చేసింది. రాహుల్ కూడా తల్లి సోనియా చుట్టూ చేయి వేసి తన ప్రేమను చాటుకున్నాడు. భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలోకి ప్రవేశించిడంతో సోనియా రాహుల్ గాంధీ (Rahul)తో కలిసి నడిచారు. ఢిల్లీ వీధుల్లో కొద్ది దూరం నడిచారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, జైరాం రమేష్, పవన్ ఖేరా కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు. యాత్ర ఢిల్లీలో 23 కిలోమీటర్ల మేర సాగుతుంది, బదర్పూర్ సరిహద్దు నుండి ప్రారంభమై ఎర్రకోట వద్ద ముగుస్తుంది. ఇది నిజాముద్దీన్, ఇండియా గేట్, ITO, ఢిల్లీ గేట్, దర్యాగంజ్ మీదుగా వెళుతుంది. ఢిల్లీలో ఒక రోజు యాత్ర సాగిన తర్వాత 9 రోజుల పాటు యాత్ర (Bharat Jodo Yatra)కు విరామమిచ్చి తిరిగి జనవరి3 వ తేదీన యాత్రను మొదలుపెడతారు.
Also Read: Murmu Telangana Tour: రాష్ట్రపతి ముర్ము పర్యటనకు సర్వం సిద్ధం!