Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్‌‌ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం

Rahul Gandhi :  ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షెడ్యూల్‌ మారింది.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 02:16 PM IST

Rahul Gandhi :  ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షెడ్యూల్‌ మారింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చేపట్టాల్సిన యాత్ర కాల వ్యవధిని తగ్గించారు. ఈవిషయాన్ని పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి.యూపీలో 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈమేరకు యాత్రలో మార్పులు చేశామని యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ తెలిపారు. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  ‘‘రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21 వరకే ముగించేలా రాహుల్‌ మార్పులు చేశారు’’ అని ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

రాహుల్ యాత్ర కొత్త షెడ్యూల్ ఇదీ.. 

  •  సవరించిన యూపీ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 16న వారణాసి మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర యూపీలోకి ప్రవేశిస్తుంది.
  • భదోహి, ప్రయాగ్‌రాజ్‌, ప్రతాప్‌గఢ్‌ మీదుగా 19న అమేథీకి యాత్ర చేరుకుంటుంది.
  • అమేథీ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు.
  • మరుసటి రోజు రాయ్‌బరేలీకి రాహుల్ చేరుకుని.. అక్కడి నుంచి లక్నోకు వెళ్తారు.
  • ఆ రోజు రాత్రి లక్నోలోనే రాహుల్ బస చేయనున్నారు.
  • 21వ తేదీన కాన్పూర్‌లోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోకి రాహుల్ యాత్ర ఎంటర్ అవుతుంది.

Also Read : 8 MLAs Missing : ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు జంప్.. బిహార్ అసెంబ్లీలో టెన్షన్.. స్పీకర్‌పై వేటు

సాగు నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ జరిగింది. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో ఒక్క చోటే ఆ పార్టీ గెలిచిందని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మాటలను రికార్డ్‌ల నుండి తొలగించాలని స్పీకర్‌ను హరీష్ రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌ను చెప్పుతో కొట్టినట్లైతే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్లేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడుతున్నందుకే ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ ఇవ్వడం లేదని తీర్మానం చేసిందని అన్నారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటైనా ఆమేథీ నుండి పోటీ చేసి రాహుల్ గాంధీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పటికీ కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు.