Bharat Bandh : రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ అణచివేస్తోంది. డ్రోన్లు పెట్టి మరీ రైతులపైకి భాష్ప వాయు గోళాలను కురిపిస్తోంది. ఈనేపథ్యంలో మోడీ సర్కారు నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ 200కుపైగా రైతు సంఘాలు కీలక ప్రకటన చేశాయి. ఈ నెల 16న(శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన హర్యానా, పంజాబ్ రైతులను కేంద్రం అరాచకంగా అణచివేస్తున్న తీరుకు నిరసనగా బంద్‌లో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులను కోరారు.
We’re now on WhatsApp. Click to Join
భారత్ బంద్‌లో(Bharat Bandh) భాగంగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటించాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున నిరసన తెలపాలన్నారు. పంజాబ్‌లో ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రహదారులను నాలుగు గంటల పాటు మూసివేయనున్నారు.
Also Read : Illegal Assets Case : శివబాలకృష్ణ డ్రైవర్, అటెండర్ అరెస్ట్.. వారి పేరిట కళ్లుచెదిరే ఆస్తులు
మోడీ సర్కారుకు రాజకీయ సంకటం !
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నదాతలు ఆందోళన బాట పట్టడం రాజకీయంగా మోడీ సర్కారుకు ఇబ్బందులు కలిగించే అంశమే. అయినప్పటికీ కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు రైతు సంఘాలతో చర్చలు జరుపుతూనే మరో వైపు రైతులను నియంత్రించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతాబలగాలను మోహరించింది. కీలక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, CAPF, RAPF సిబ్బంది పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దులు, ఢిల్లీ-నోయిడా మార్గం, ఘాజీపూర్ సరిహద్దులన్నీ భద్రతాబలగాల గుప్పెట్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంబులెన్స్‌ల ప్రయాణం కూడా కష్టంగా ఉంది. అసలు పంజాబ్ నుంచి వచ్చిన రైతులను హర్యానా దాటి వెళ్లనీకుండానే.. అక్కడి పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏడు జిల్లాల్లో ఇంటర్నెంట్ సేవలు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించారు. ఎర్రకోటకు సందర్శకులను నిలిపివేశారు. ఢిల్లీ-యూపీ, పంజాబ్-హర్యానా-ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో మూడేళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎటుచూసినా తుపాకులు చేతబూనిన భద్రతా సిబ్బందే కనిపిస్తున్నారు