Bharat Bandh : ఎల్లుండి భారత్ బంద్‌

రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Bharat Bandh 2024

Bharat Bandh 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎల్లుండి భారత్ బంద్‌ (Bharat Bandh)కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి సభ్యులు వాపోతున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్‌లో SC, ST సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆగస్టు 1న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకర అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది.

Read Also : Narayana Murthy: దేశంలో జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

  Last Updated: 19 Aug 2024, 12:09 PM IST