Viral Video: భాయ్ కో క్యా హువా..? కార్యకర్తపై రాహుల్ కన్నెర, వీడియో వైరల్!

ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కార్యకర్తపై రెచ్చిపోయి కోపం ప్రదర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Viral video Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు రాహుల్ తో సెల్ఫీ (Selfi) తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే బిజీగా రాహుల్ గాంధీ ఆ కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త ను పక్కకు తోసి ముందుకు వెళ్తే ప్రయత్నం చేశారు. రాహుల్ (Rahul Gandhi) ఆగ్రహం చూసి ఇతర కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. బుధవారం ఉదయం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

రాహుల్ వీడియో నిమిషాల్లో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ట్విట్టర్ లో రాహుల్ వీడియోను ట్వీట్ చేసి, దీన్నే నిగ్రహాన్ని కోల్పోవడం అంటారు! అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. భారత్ జోడో యాత్ర అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించాడు. మరో పార్టీ నాయకుడు, రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీకాంత్ భరద్వాజ్ కూడా వీడియోను ట్వీట్ చేసి, “భాయ్ కో క్యా హువా?” అని కామెంట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ (Rahul Gandhi) వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతోంది.

Also Read : Gali Janardhana Reddy Son: నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమా!

  Last Updated: 21 Dec 2022, 05:07 PM IST