Bhagwant Mann: పంజాబ్‌ 25వ సీఎంగా.. నేడే భగవంత్‌ మాన్ ప్ర‌మాణ స్వీకారం

  • Written By:
  • Updated On - March 16, 2022 / 09:27 AM IST

చండీగఢ్: దిగ్గజ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మస్థలం ఖతర్ కలాన్‌లో పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో ద్వారా, మన్ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించాడు. ఖట్కర్ కలాన్‌లో జరిగే వేడుకకు హాజరు కావాలని పంజాబ్ ప్రజలను ఆహ్వానించాడు. మార్చి 16న భగత్ సింగ్ ఖట్కర్ కలాన్‌లో భగవంత్ మాన్ ప్రమాణం చేసి సీఎం అవ్వడమే కాదు.. త‌న‌తో పాటు పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజలు కూడా సీఎం అవుతారని ట్విట్ట‌ర్ లో తెలిపారు.

అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ ప్రభుత్వమే అవుతుందని.. మార్చి 16న ఉదయం 10 గంటలకు ఖట్కర్‌ కలాన్‌లో జరిగే వేడుకలకు అంద‌రూ హాజరుకావాల‌ని ఆయ‌న కోరారు.భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజ‌రుకానున్నారు. అయితే ఇత‌ర రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాబోరని ఆప్ వర్గాలు తెలిపాయి. అలాగే, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రిగానీ, జాతీయ స్థాయిలోని పెద్ద పెద్ద నాయకులను గానీ ఆహ్వానించలేదని… ప్రమాణస్వీకారోత్సవానికి ఆప్ నేతలు, పంజాబ్ స్థానిక నేతలు మాత్రమే హాజరుకానున్న‌ట్లు ఆప్ వ‌ర్గాలు తెలిపాయి.

మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ వేడుకకు మొత్తం 117 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇంకా, భగవంత్ మాన్ కుటుంబం, సన్నిహిత వ్యక్తులను ఆహ్వానించారు. వీరిలో పంజాబ్‌తో సంబంధం ఉన్న పలువురు కళాకారులు ఉన్నారు. కాగా, మార్చి 16న షహీద్ భగత్ సింగ్ (ఎస్‌బిఎస్) నగర్ జిల్లాలోని ఖట్కర్ కలాన్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో వేడుకలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి నాలుగు నుంచి ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ఏ వేణు ప్రసాద్ తెలిపారు.ల‌క్ష మందికి సీటింగ్ ఏర్పాటు చేయబడింద‌ని.. వేదిక 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని ఆయ‌న తెలిపారు. ప్రధాన ఈవెంట్ కోసం 50 ఎకరాలు, పార్కింగ్ కోసం 50 ఎకరాలు కేటాయించిన‌ట్లు వేణు ప్ర‌సాద్ తెలిపారు. వేడుకను దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజల కోసం రోజుకు ప్రయాణ సలహా జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 వేల నుంచి 10 వేల మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైతే మరింత మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు. “ప్రోటోకాల్ ప్రకారం, మూడు దశలు ఏర్పాటు చేయబడతాయని… మొత్తం ఎనిమిది పార్కింగ్ స్థలాలు ఉంటాయ‌న్నారు.