Bengaluru: కండక్టర్ పై మహిళ గర్వం చూడండి: వీడియో

కులం, మతం.. ఈ రెండు మానవ సంబంధాలను కూడా తెంచెయ్యగలవు. సమాజానికి పట్టిన చీడపురుగులు కులం, మతం. అయితే జనరేషన్ మారుతున్నా కొద్దీ మనుషుల్లో మార్పు కనిపిస్తుంది.

Bengaluru: కులం, మతం.. ఈ రెండు మానవ సంబంధాలను కూడా తెంచెయ్యగలవు. సమాజానికి పట్టిన చీడపురుగులు కులం, మతం. అయితే జనరేషన్ మారుతున్నా కొద్దీ మనుషుల్లో మార్పు కనిపిస్తుంది. అయినప్పటికీ కొందరు మాత్రం అదే ఊబిలో బ్రతుకుతున్నారు. మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నాయి. అయితే ఎవరి ఇష్టాలకు వాళ్ళను వదిలెయ్యాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు కొందరికి. తాజాగా బెంగుళూరులో ఓ మహిళా ప్రవర్తించిన తీరు సభ్యసమాజానికి ఇబ్బందిగా మారింది.

బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)లో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ముస్లీమ్ కండక్టర్ కి చేదు అనుభవం ఎదురైంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ కండక్టర్ తో వాగ్వాదం పెట్టుకుంది. సదరు కండక్టర్ ముస్లీమ్ కావడంతో తన మత ఆచారానికి తగ్గట్టు టోపీ ధరించాడు. అయితే ఆ మహిళ కండక్టర్ ధరించిన టోపీ తియ్యల్సిందిగా, మీ ఆచారం మసీదులో పాటించాలని, ఇది ప్రభుత్వ వాహనం అని, ప్రభుత్వ వాహనంలో కండక్టర్ ధరించాల్సిన యూనిఫార్మ్ మాత్రమే ధరించాలని గర్వాన్ని ప్రదర్శించింది. నిజానికి సదరు కండక్టర్ ఖాకీ దుస్తుల్లోనే ఉన్నాడు. అయినప్పటికీ టోపీ తియ్యాలని పదేపదే డిమాండ్ చేసింది.

మహిళ గర్వంతో మాట్లాడుతున్నప్పటికీ కండక్టర్ మాత్రం ఎంతో వినయంగా, సున్నితంగా సమాధానం ఇచ్చాడు. తాను డ్యూటీ సమయంలో చాలా ఏళ్లుగా టోపీ ధరిస్తున్నానని, ఇంతకు ముందు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని బదులిచ్చారు. ఇంట్లో లేదా మసీదులో మీ మతాన్ని ఆచరించండి. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో ఉన్నప్పుడు టోపీ పెట్టుకోకూడదు అని ఆ మహిళ చెప్పడంతో చివరికి కండక్టర్ తాను ధరించిన ఆకుపచ్చ రంగు టోపీని తీసివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కండక్టర్ మనస్తత్వానికి అభినందనలు తెలుపుతున్నారు.

Read More: Rahul Gandhi : కొత్త ఇంట్లోకి మారబోతున్న రాహుల్ గాంధీ!