Site icon HashtagU Telugu

Bengaluru: భారీ వర్షాలకు కూలిన మెట్రో స్టేషన్ గోడ..వాహనాలు ధ్వంసం..ఎల్లో అలర్ట్ జారీ..!!

Benguluru

Benguluru

భారీ వర్షాలు బెంగుళూరును అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు నీటిలో పడవల్లా తేలాయి. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బెంగుళూరులో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కాగా భారీ వర్షాలకు బెంగుళూరులోని శేషాద్రిపురం ప్రాంతంలో మెట్రో స్టేషన్ ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. శివాజీనరగ్, ఇందిరానగర్ లో వర్షం నీళ్లు ఇళ్లలోకి చేరారు. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. భవనాల్లో సెల్లార్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

బెంగుళూరు వరద నీరు కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వ్యక్తి వీడియోను పోస్టు చేశారు. ఇది నా భవనం కాదు..ఓ నది అంటూ షేర్ చేసాడు.