Site icon HashtagU Telugu

Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు

Most Congested City In India

Most Congested City In India

 

Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత  తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్‌ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా కేఫ్‌ను పునర్నిర్మించారు. కొన్ని మరమ్మతు పనులు చేపట్టారు. కస్టమర్లకు సురక్షితమైన వాతావరణం కోసం కొన్ని మార్పులు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు. తమ భద్రతా బృందాన్ని పటిష్ఠం చేస్తున్నామని, సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ సైనికులతో కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా, కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్లో గత శుక్రవారం బాంబ్‌ బ్లాస్ట్ (Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్‌, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్‌ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్‌ సెట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

read also : Sai Dharam Tej: తల్లి మీద ప్రేమతో పేరు మార్చుకున్న సాయి తేజ్.. కొత్త పేరు అదే?