Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.

Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. పేలుడుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నిందితుడు కేఫ్ సమీపంలో బస్సు దిగడం కెమెరాలో రికార్డ్ అయింది. టోపీ, ముసుగు మరియు కళ్ల అద్దాలతో అతని ముఖాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సీసి ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు.

బెంగళూరు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి రామేశ్వరం కేఫ్ ఏరియా చుట్టూ అనుమానితుల కదలికలను నిశితంగా పరిశీలించారు. కేఫ్ నుండి డిజిటల్ వీడియో రికార్డర్ ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆధారాల కోసం సమీపంలోని ఇతర షాపుల నుండి ఫుటేజీని సేకరించారు. నిందితుడి వయస్సు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనాని దృవీకరించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాగా నేరస్థుడిని త్వరితగతిన పట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర. కాగా.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు ముందస్తు దాడులతో సహా వివిధ కోణాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

Also Read: Gopichand: అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. గోపీచంద్ కామెంట్స్!