Rameshwaram Cafe: కేఫ్‌లో పేలుడు ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌

  Rameshwaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru )లోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపాయి. ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని (Key suspect taken into custody) విచారిస్తున్నట్లు […]

Published By: HashtagU Telugu Desk
111

Bengaluru Blast Case.. Key Suspect In Bengaluru Cafe Blast Case Taken Into Custody

 

Rameshwaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru )లోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపాయి. ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని (Key suspect taken into custody) విచారిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1 శుక్రవారం బాంబ్‌ బ్లాస్ట్ (Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్‌, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. కేఫ్‌లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 ల‌క్షల రివార్డు కూడా ఇస్తామ‌ని ఎన్‌ఐఏ ఇప్పటికే ప్రకటించింది. దాదాపు ఘటన జరిగిన 13 రోజులకు ప్రధాన నిందితుడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

read also: LS Elections : ఖమ్మంలో బీజేపీ టికెట్ రేసులో కొత్త మలుపు

 

  Last Updated: 13 Mar 2024, 12:33 PM IST