పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్ కర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎన్డిఏ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ప్రకటించారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ పలువురు బిజెపి కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి రేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దనకర్ పేరు వినిపించకపోయినప్పటికీ కూడా అతన్ని బిజెపి పోటీలో దింపుతుంది. అయితే వచ్చే నెల 10 తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకోనున్నారు. కాగా ఈ ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇక ఈ పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ స్వస్థలం రాజస్థాన్. అయితే ఆయన కెరీర్ మొదట్లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ సింగ్ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు జగదీప్..