Site icon HashtagU Telugu

Governors Vs Politicians : గ‌వ‌ర్నర్ గిరీ జాన్తానై.!

Ts Ap Bengal Governors

Ts Ap Bengal Governors

బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీస్ ధంఖ‌ర్ కు మ‌రో ర‌క‌మైన అవ‌మానం జ‌రిగింది. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అసెంబ్లీలో అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి అధికార ఎమ్మెల్యేలు ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డుకున్నాయి. మ‌హిళా ఎమ్మెల్యేలు ఏకంగా ఆయ‌న్ను చుట్టుముట్టే ప‌నిచేశారు. తొలి రోజు విధానసభలో నినాదాలు, గందరగోళం మరియు నిరసనల మధ్య ప్రసంగాన్ని అందించలేకపోయారు. 25 పేజీల ప్రసంగంలో కేవలం ఒక వాక్యాన్ని మాత్రమే చదివ‌డానికి అవ‌కాశం వ‌చ్చింది. సుమారు గంటసేపు జరిగిన రచ్చలో ఆ ఒక్క వ్యాఖ్యం కూడా వినిపించ‌లేదు. దీంతో అసెంబ్లీ నుండి నిష్క్రమించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గందరగోళం తర్వాత గవర్నర్‌కు ‘ఓట్ ఆఫ్ కృతజ్ఞతలు’ అందించడానికి రాజ్‌భవన్‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అసెంబ్లీలో జ‌రిగిన అసహ్యకరమైన సంఘటనలతో కలవరపడ్డాను. ఊహించని రీతిలో మహిళా మంత్రుల దిగ్బంధన ప్రయత్నానికి బాధ వేసింద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ట్విట్ట‌ర్లో ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిష్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ వివాద ర‌హితునిగా ఉండ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాడు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుగుణంగా వ్య‌వ‌హిరిస్తున్నాడు. రాజ్యాంగ బ‌ద్ధంగా ఏమి చేయాలో..ఆ విధంగా చేస్తూ వెళుతున్నాడు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ని కూడా పార్టీ చేస్తూ పిటిష‌న్ వేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ రాజ్ భ‌వ‌న్ ప‌ని రాజ్ భ‌వ‌న్ చేస్తూ వెళుతోంది. బ‌డ్జెట్ స‌మావేశం సంద‌ర్భంగా హరిచంద‌న్ చేసిన ప్ర‌సంగంలో అధికార వికేంద్ర‌క‌ర‌ణ అంశం ఉంది. హైకోర్టు తీర్పు చెప్పిన రెండు రోజుల‌కే మూడు రాజ‌ధానులు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మంటూ చ‌ద‌వ‌డాన్ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ త‌ప్పుబ‌ట్టాడు. అంతేకాదు, ఆయ‌న మీద అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ కు హెడ్ గుమాస్తాగా హ‌రిచంద‌న్ ప‌నిచేస్తున్నాడ‌ని విమ‌ర్శించాడు. కేంద్రానికి, రాష్ట్రానికి బ్రోక‌ర్ అంటూ ఏపీ గ‌వ‌ర్న‌ర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.
బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని నిర‌సిస్తూ టీడీపీ స‌భ్యులు సోమ‌వారం అసెంబ్లీ వేదిక‌గా నానా హంగామా చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి అడ్డు త‌గిలారు. బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను చించివేశారు. గ‌వర్న‌ర్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగాన్ని బాయ్ కాట్ చేసే క్ర‌మంలో కొద్దిసేపు గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఇలా..ఆయా రాష్ట్రాల్లోని గ‌వ‌ర్న‌ర్ల‌కు అవ‌మానం జ‌రిగింది.