Site icon HashtagU Telugu

Morbi Bridge Effect : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!

Morbi

Morbi

గుజరాత్ లోని మెర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన నేపథ్యంలో…తమ రాష్ట్రంలోని అధికారులను అలెర్ట్ చేసిన బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని కేబుల్ బ్రిడ్జిల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాణాత్మక నివేదికను కోరింది. రాష్ట్ర సచివాలయం నబన్నకు చెందిన వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేబుల్ వంతెనలు ప్రధానంగా తెరాయ్ దూర్ ప్రాంతాల అడవులు, ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయమై వచ్చే 24 గంటల్లో రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పులక్ రాయ్ అన్ని జిల్లాల పీడబ్ల్యూడీ ఇంజనీర్లను నివేదిక కోరారు. రాయ్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి హెచ్‌కె. ద్వివేది కూడా హాజరుకానున్నారు.

ఇటీవలి కాలంలో చేపట్టిన బ్రిడ్జిల పునరుద్ధరణ పనుల నివేదికతోపాటు సహా జిల్లాల్లోని కేబుల్ వంతెనల పరిస్థితిపై తాజా సమాచారాన్ని కోరినట్లు పీడబ్ల్యూడీ వర్గాలు తెలిపాయి. మార్చి 2016లో కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద రోడ్ ఫ్లైఓవర్ కూలి 27 మంది మరణించారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధానిలోని అన్ని ప్రధాన వంతెనలు, ఫ్లై ఓవర్ల సాధారణ నిర్వహణ, పునరుద్ధరణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

“భవిష్యత్తులో మోర్బి వంటి విపత్తులు జరగకుండా జిల్లాల్లో వంతెనల విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారని” అని పిడబ్ల్యుడి అధికారి ఒకరు తెలిపారు. మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ , ప్రతిపక్ష బిజెపి మధ్య మాటల యుద్ధం జరిగింది. గుజరాత్‌లో విపరీతమైన అవినీతి పతనానికి బ్రిడ్జి కూలడం ఒక ఉదాహరణ అని తృణమూల్ నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వంతెన కూలిన సంఘటనలను బిజెపి సహచరులు అధికార పార్టీకి గుర్తు చేశారు.

Exit mobile version