G20 Meeting : మోడీ ఢిల్లీ స‌మావేశానికి బెంగాల్ సీఎం

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీ వ్యూహంలో ప‌డిపోయారు. గ‌త కొన్నేళ్లుగా మోడీ స‌మావేశాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన దీదీ డిసెంబ‌ర్ 5వ తేదీన జ‌రిగే జీ 20 స‌మావేశానికి హాజ‌రు కానున్నారు.

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 04:54 PM IST

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీ వ్యూహంలో ప‌డిపోయారు. గ‌త కొన్నేళ్లుగా మోడీ స‌మావేశాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన దీదీ డిసెంబ‌ర్ 5వ తేదీన జ‌రిగే జీ 20 స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఆ మేర‌కు బెంగాల్ సీఎంవో సంకేతాలు ఇచ్చింది. 2023లో జరిగే జి20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం కోసం సన్నాహక ప్రక్రియపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజ‌కీయ పార్టీల చీఫ్ ల‌తో ప్రధాని మోదీ స‌మావేశం గురించి పీఎంవో ఆఫీస్ ఆహ్వానాల‌ను పంపింది.

పశ్చిమ బెంగాల్‌లో జి 20కి సంబంధించిన‌ నాలుగు ఈవెంట్‌లు జరిగే అవకాశం ఉంది. సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌ను సందర్శిస్తార‌ని తెలుస్తోంది. అయితే, బెంగాల్ సీఎం డిసెంబరు ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధానితో ముఖాముఖి స‌మావేశం అవుతారా లేదా అనేది ధ్రువీక‌రించాల్సి ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఎక్కువ‌గా మోడీపై బెంగాల్ సీఎం మ‌మ‌త విరుచుకుప‌డ్డారు. ప‌లు కేసుల‌ను ఆమె ఎదుర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం యుద్ధం ఆ రాష్ట్రం న‌డిచింది. వ‌స్తు మరియు సేవల పన్ను (జిఎస్‌టి) కారణంగా బెంగాల్ బకాయిలు, వివిధ కేంద్ర పథకాల కింద నిధులను పిఎం మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వెనుకకు నెట్టివేస్తోందని టిఎంసి అధిష్టానం కేంద్ర ప్రభుత్వంపై ఇటీవ‌ల విరుచుకుపడ్డారు. అయితే, ఇటీవ‌ల కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం ఆమెకు ఊర‌ట‌నిచ్చింది. దీంతో మోడీ ఢిల్లీ స‌మావేశానికి ఆమె హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని బెంగాల్ టాక్‌.