Site icon HashtagU Telugu

Mahua Moitra : ‘‘బేషరమ్ బేహుదా’’.. ఆ ఛైర్మన్‌పై మహిళా ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra : ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే అభియోగాలపై ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్రశించింది. అయితే కమిటీలోని సభ్యులు అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతున్నారంటూ.. విచారణ ప్రక్రియ నుంచి మధ్యలోనే మహువా వాకౌట్ చేశారు. తాజాగా ఆదివారం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చీఫ్ వినోద్ సోంకర్‌పై ఎంపీ మహువా మొయిత్రా నిప్పులు చెరిగారు. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలతో ధ్వజమెత్తారు. ‘‘బీజేపీ వాళ్లు తప్పుడు కథలను పుట్టించి మహిళా ఎంపీలను పార్లమెంటు నుంచి సాగనంపే ప్లాన్‌లో ఉన్నారు.  ఎథిక్స్ కమిటీలోని సభ్యులు నాతో ఏమేం మాట్లాడారు ? నన్ను ఏమేం అడిగారు ? అనే రికార్డులు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఈవిషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలి. కమిటీ ఛైర్మన్ చౌకబారు ప్రశ్నలు, అనవసర ప్రశ్నలు, సంబంధం లేదని ప్రశ్నలు అడిగారు.  ప్రతిపక్షాల నిరసనలు, నా నిరసనలను బ్లాక్ అండ్ వైట్‌లో చూసే ప్రయత్నంలో వాళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది. బేషరమ్.. బేహుదా’’ అని కామెంట్ చేస్తూ ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘బీజేపీ వాళ్లు నాపై క్రిమినల్ కేసులను పెట్టే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. నా దగ్గరికి వచ్చి ఎన్ని జతల బూట్లు ఉన్నాయని ప్రశ్నించే ముందు.. వాళ్లు నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అదానీపై రూ.1.30 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాక నన్ను ప్రశ్నించేందుకు రావచ్చు’’ అని మహువా మొయిత్రా చెప్పారు. అదానీపై వస్తున్న అభియోగాల నుంచి ప్రజల ఫోకస్‌ను డైవర్ట్ చేసేందుకే బీజేపీ తనను టార్గెట్ చేస్తోందని ఆమె తెలిపారు. కాగా, ఎంపీ మహువా మొయిత్రా ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నవంబరు 7న భేటీ కానుంది. తదుపరి విచారణ ప్రక్రియకు సంబంధించి ఆ సమావేశంలో నిర్ణయం(Mahua Moitra)  తీసుకోనున్నారు.

Also Read: WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో సరికొత్త ఫీచర్.. ఇదిగో