Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

ఇటీవల బెంగళూరులో డెలివరీ బాయ్ చేసిన ఘాతుకం మరువక ముందే, తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఓ యువతి ఒంటరిగా ఉందనే విషయాన్ని గమనించిన ఒక డెలివరీ బాయ్, పార్సిల్ ఇచ్చే నెపంతో ఏకంగా ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించాడు. బలవంతంగా తలుపు నెట్టుకుంటూ

Published By: HashtagU Telugu Desk
Delivery Boys

Delivery Boys

Delivery Boys : ప్రస్తుత ఆధునిక కాలంలో పట్టణాలు, నగరాలలో నివసించే వారికి ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్లు నిత్యావసరాలుగా మారిపోయాయి. రోజుకో డెలివరీ బాయ్ ఇంటి తలుపు తట్టడం సర్వసాధారణం అయింది. అయితే, ఇదే సౌకర్యాన్ని కొందరు వికృత బుద్ధి గల డెలివరీ బాయ్స్ తమ అరాచకాలకు అదనుగా మార్చుకుంటున్నారు. ఇటీవల బెంగళూరులో డెలివరీ బాయ్ చేసిన ఘాతుకం మరువక ముందే, తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఓ యువతి ఒంటరిగా ఉందనే విషయాన్ని గమనించిన ఒక డెలివరీ బాయ్, పార్సిల్ ఇచ్చే నెపంతో ఏకంగా ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించాడు. బలవంతంగా తలుపు నెట్టుకుంటూ లోపలికి వెళ్లబోయిన క్రమంలో.. అదృష్టవశాత్తూ అదే సమయంలో లోపలి గది నుంచి యువతి తల్లి బయటకు రావడంతో ఆ కీచకుడు భయపడి, ఏవో పొంతన లేని మాటలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ తరహా ఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాల్సిందే!

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల బారిన పడకుండా ఉండటానికి, ఇంట్లో మహిళలు లేదా కాలేజీ విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని కఠినమైన భద్రతా నియమాలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకునేటప్పుడు డోర్ పూర్తిగా తెరవకుండా, సేఫ్టీ గ్రిల్ గేట్ లేదా లాక్ ఉండేలా చూసుకోవడం మంచిది. డెలివరీ బాయ్స్ ఇచ్చే పార్సిళ్లను వీలైనంత వరకు ఇంటి బయటే అందుకోవాలి. కంపెనీలు డెలివరీ బాయ్స్‌కు ఐడీ కార్డులు, వెరిఫికేషన్ ప్రక్రియలు నిర్వహిస్తున్నప్పటికీ, వ్యక్తిగత జాగ్రత్తలు అత్యంత అవసరం. అనుమానాస్పదంగా ప్రవర్తించే డెలివరీ బాయ్స్ వివరాలను, లైవ్ లొకేషన్ హిస్టరీని తక్షణమే సదరు ఈ-కామర్స్ యాప్‌లలో రిపోర్ట్ చేయడంతో పాటు, అత్యవసర సమయాల్లో పోలీసుల ‘డైల్ 100’ లేదా మహిళా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చు.

  Last Updated: 19 Jul 2026, 11:54 AM IST