Site icon HashtagU Telugu

1st Woman : అసెంబ్లీ స్పీకర్‌గా యాంకర్.. ఎవరు ?

1st Woman

1st Woman

1st Woman : ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బారిల్ వన్నేహా సాంగ్ అనే  టీవీ యాంకర్ గెలుపొందారు. అనూహ్యంగా ఆమెకు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కింది. దీంతో మిజోరాం రాష్ట్ర చరిత్రలో  తొలిసారిగా ఓ మహిళకు స్పీకర్ అయ్యే అవకాశం దక్కింది. బారిల్ వన్నేహా సాంగ్(1st Woman) తొలుత చిన్న చానెల్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. అనంతరం కాలంలో వివిధ టీవీ ఛానళ్లలో యాంకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్‌గా ఎదిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజ్వాల్ సౌత్- 3 నియోజకవర్గం  నుంచి జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు. దీంతో 33 ఏళ్ల చిన్న వయస్సులోనే మిజోరంలో ఎమ్మెల్యే అయిన రికార్డును కూడా  బారిల్ వన్నేహా సాంగ్ సొంతం చేసుకున్నారు. మిజోరాం అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. స్పీకర్‌గా నియమితురాలైన బారిల్ వన్నేహా సాంగ్.. 40 మంది ఎమ్మెల్యేలను సభలో కంట్రోల్ చేయనున్నారు.వారికి తగిన గైడ్ లైన్స్ ఇచ్చి, సభను పర్యవేక్షించనున్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ముందు బారిల్ వన్నేహా సాంగ్ ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా చెప్పుకొచ్చారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కి చెందిన బారిల్ వన్నేహా సాంగ్ ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నేహా సాంగ్ చరిత్ర సృష్టించారు.

Also Read :AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్‌ సెల్స్‌..!

Exit mobile version