Site icon HashtagU Telugu

Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్‌ స్టోరీ

Costly Buffalo

Costly Buffalo

Costly Buffalo : గేదె ధర సాధారణంగా ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. ఎక్కువలో ఎక్కువ ముర్రా జాతికి చెందిన గేదెల ధర రూ.1 నుంచి 2 లక్షల మధ్య ఉంటే, అది చాలని భావిస్తాం. కానీ గుజరాత్‌లో ఓ గేదె ఏకంగా రూ.14.1 లక్షలు పలికింది. ఈ ధర ఏకంగా ఒక రికార్డే. ఒక్క గేదెకు ఈ స్థాయిలో ధర ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగడం ఖాయం.

ఈ భారీ ధర పలికిన గేదె సాధారణమైనది కాదు. ఇది బన్నీ జాతికి చెందిన అరుదైన గేదె. భారతదేశంలో ఈ జాతికి చెందిన గేదెలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, అదే గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే ఈ జాతికి చెందిన గేదెలను చూడవచ్చు.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో లఖ్‌పత్ తాలూకాలోని సంధ్రో గ్రామానికి చెందిన గజీ హాజీ అలాదాద్, తన వద్ద ఉన్న బన్నీ గేదెను ఇటీవల అమ్మకానికి పెట్టాడు. ఈ గేదెను కొనేందుకు పలువురు ఆసక్తి చూపారు. చివరకు సెర్వా గ్రామానికి చెందిన షెరుబాయ్ బాలు అనే రైతు ఏకంగా రూ.14.1 లక్షల ధరకు ఈ గేదెను కొనుగోలు చేశారు.

ఈ గేదెల ప్రత్యేకతలు ఏమిటి?

పాల ఉత్పత్తి: బన్నీ గేదెలు రోజు మధ్యం 12 నుంచి 18 లీటర్ల వరకు నాణ్యమైన పాలను ఇస్తాయి.

ఆరోగ్యం: ఇవి సాధారణ గేదెలతో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి.

విభిన్న ఆకృతి: బన్నీ గేదెలు మోటుగా, నల్లగా ఉండే శరీర నిర్మాణంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

పాల రుచికి డిమాండ్: బన్నీ గేదె పాలు రుచిగా ఉండటంతో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.

స్థానికంగా పెరుగుతున్న గేదెల విలువ

ఇలాంటి అరుదైన జాతులకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం పాల కోసం కాకుండా, మంచి జాతి వృద్ధి కోసం కూడా ఇటువంటి గేదెల కొనుగోలు చేస్తున్నారని గుజరాత్‌లోని పశుపాలకులు చెబుతున్నారు. బన్నీ గేదెలకు సంబంధించిన ఈ రికార్డు ధర వ్యవసాయ, పశుపోషణ రంగాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో, భారతదేశంలోని అనుకూల గాలివాతావరణంలో పెరిగే ప్రత్యేక జాతి గేదెల విలువ ఎలా పెరుగుతోందో స్పష్టమవుతోంది. ఆర్థికంగా లాభదాయకమైన పశుపోషణకు ఇది ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

CM Revanth Reddy : పాశమైలారం ప్రమాదంపై నిపుణులతో విచారణ.. సీఎం ఆదేశం

Exit mobile version