600 Bank Jobs : ఏదైనా డిగ్రీ కోర్సు చేసిన వారికి బ్యాంకులో ఉద్యోగ అవకాశం. 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 పోస్టులలో 305 అన్ రిజర్వ్‌డ్, 131 ఓబీసీ, 51 ఈడబ్ల్యూఎస్, 48 ఎస్టీ, 65 ఎస్సీలకు(600 Bank Jobs) రిజర్వ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌కు అప్లై చేసే వారికి 2024 జూన్ 30 నాటికి 20 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉండాలి. వయో పరిమితిలో ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్ల దాకా సడలింపు లభిస్తుంది.
Also Read :Canada Vs India : కెనడా బరితెగింపు.. భారత్‌పై త్వరలో ఆంక్షలు
అప్లికేషన్ ఫీజు
అభ్యర్థులు అక్టోబరు 24లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.150తో పాటు జీఎస్‌టీని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.100తో పాటు జీఎస్‌టీని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మొత్తం మినహాయింపు ఉంది.
Also Read :Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జాబ్‌కు ఎంపిక చేసిన తర్వాత ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ముగిసే వరకు ప్రతినెలా రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అన్ని డ్యాకుమెంట్లు, ఫొటో, సిగ్నేచర్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే పే చేయాలి.
Also Read :Omar Abdullah : రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
బ్యాంకు ఉద్యోగాలు చేసేవారిపై క్రమంగా పని ఒత్తిడి పెరుగుతోంది. వారికి కేటాయించే బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.లోన్లు, మ్యూచువల్ ఫండ్లు, జన్ ధన్ అకౌంట్లు, ఆధార్ లింక్ వంటి సేవలన్నీ బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ సేవల కోసం బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు సర్వీసు చేయాల్సిన బాధ్యత బ్యాంకు ఉద్యోగులపై ఉంటోంది. ప్రతినెలా వివిధ రకాల టార్గెట్లు కూడా బ్యాంకు ఉద్యోగులపై ఉంటున్నాయి.