Site icon HashtagU Telugu

Bank Holidays in March 2024 : మార్చి లో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవు..

Bank Holiday

Bank Holiday

నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది చూస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో మార్చి (March 2024) నెల రాబోతుంది. ఈ తరుణంలో మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి..ఏ ఏ రోజు బ్యాంకులకు సేవలు అనేది తెలుసుకునే పనిపడ్డారు. ఇక వచ్చే నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. ఈ 14 రోజుల్లో నేషనల్‌ పబ్లిక్ హాలిడేస్‌, కొన్ని ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి.

2024 మార్చిలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in March 2024) ఇలా ఉన్నాయి.

మార్చి 01 (శుక్రవారం) – చాప్చార్ కుట్ – మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 03 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 08 (శుక్రవారం) – మహా శివరాత్రి – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

మార్చి 09 – రెండో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 10 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 17 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 22 (శుక్రవారం) – బిహార్ దివస్ – బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 24 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 25 (సోమవారం) – హోలీ – కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 26 (మంగళవారం) – యయోసాంగ్ రెండో రోజు/హోలీ – ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 27 ‍‌(బుధవారం) – హోలీ – బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 29 ‍‌(శుక్రవారం) – గుడ్ ఫ్రైడే- త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 30 – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 31- ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు. ఇలా మొత్తంగా 14 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. అయినప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Read Also : Drugs Case : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరు..