Site icon HashtagU Telugu

Bank Holidays in May 2024 : మే నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులులు సెలవులు

Bank Holiday

Bank Holiday

నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది చూస్తుంటారు.

ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. మరో నాల్గు రోజుల్లో మే (May 2024) నెల రాబోతుంది. ఈ తరుణంలో మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి..ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు అనేది తెలుసుకునే పనిపడ్డారు. ఇక వచ్చే నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. వీటిలో 2 & 4 శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. ఈ నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులను మూసివేస్తారు. మే డే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, నజ్రుల్ జయంతి, అక్షయ తృతీయ వంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ సెలవులు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి.

ఇక మే నెలలో ఏ ఏ రోజు బ్యాంక్‌ సెలవు చూద్దాం.

మే 01 (బుధవారం): మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా బ్యాంకులకు సెలవు.

మే 05: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

We’re now on WhatsApp. Click to Join.

మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (Rabindra Jayanti) సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకులను మూసివేయనున్నారు

మే 10 ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు ఇచ్చారు

మే 11: రెండో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి

మే 12: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 13 : లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికలు సందర్బంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు

మే 19: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 20 ‍‌(సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులను మూసేస్తారు.

మే 23 ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు.

మే 25: నాలుగో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి

మే 26: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

ఇలా మొత్తంగా 12 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. అయినప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Read Also  : The World’s Costliest Mango : వామ్మో కేజీ మామిడి పండ్లు లక్షపైనేనా..?

Exit mobile version