Bank Holidays July 2025 : జులై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా..?

Bank Holidays July 2025 : బ్యాంకులు మూసివుండే రోజుల్లోనూ మీరు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు. నేటి డిజిటల్ యుగంలో బ్యాలెన్స్ తనిఖీ చేయడం, నిధుల బదిలీ, బిల్లులు చెల్లించడం వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు ఇంటి నుంచే చేయవచ్చు

Published By: HashtagU Telugu Desk
Banks Holiday

Banks Holiday

జూలై 2025లో మీరు బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటే, ముందుగానే బ్యాంకు సెలవుల (Bank Holidays) జాబితాను చూసుకోవడం మంచిది. ఎందుకంటే సెలవు రోజు తెలియకుండా బ్యాంక్ కు వెళ్లితే, పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే బ్యాంకు సెలవులను చూసుకొని బ్యాంకు పనుల కోసం వెళ్తే మంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకారం.. జూలై(July 2025)లో 13 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇందులో ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు, అలాగే కొన్ని ప్రాంతీయ పండుగల కారణంగా సెలవులు ఉండబోతున్నాయి.

The Strait Of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ఏమిటి? చ‌మురు ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా?

జూలై 3న ఖర్చీ పూజ, 5న గురు హర్‌గోబింద్ జయంతి, 14న బెహ్ దీంక్లాం, 16న హరేలా పండుగ, 17న ఉ తిరోత్ సింగ్ వర్ధంతి, 19న కేర్ పూజ, 28న ద్రుక్పా షె జీ లాంటి పండుగలు, సందర్భాలు కారణంగా వివిధ నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. అంతేకాదు జులై 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు, 12 మరియు 26 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు ఉండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీనివల్ల మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు.

అయితే బ్యాంకులు మూసివుండే రోజుల్లోనూ మీరు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు. నేటి డిజిటల్ యుగంలో బ్యాలెన్స్ తనిఖీ చేయడం, నిధుల బదిలీ, బిల్లులు చెల్లించడం వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు ఇంటి నుంచే చేయవచ్చు. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల జాబితా పరిశీలించి, మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పినట్లే.

  Last Updated: 23 Jun 2025, 11:21 AM IST