Site icon HashtagU Telugu

Emergency Landing: సలామ్ ఎయిర్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200 మంది ప్రయాణికులు సురక్షితం

Indian Aviation History

Indian Aviation History

బుధవారం అర్థరాత్రి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్తున్న సలామ్ ఎయిర్‌కు చెందిన విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయింది. విమానం ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని పైలట్ గమనించినట్లు సమాచారం. దీని తర్వాత నాగ్‌పూర్‌లోనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.

Also Read: 70 Basic Trainer Aircraft: రూ.6,828 కోట్ల వ్యయంతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు

అంతకుముందు ఫిబ్రవరి 27న కోల్‌కతా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో మొత్తం 178 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులందరినీ మరో విమానంలో పంపించారు. సమాచారం ప్రకారం.. ఆ స్పైస్‌జెట్ విమాన సంఖ్య SG 83/ATD. కోల్‌కతా విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ ఫెయిల్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది.అనంతరం విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.