Site icon HashtagU Telugu

Bangladesh: ‘సర్’ సంబోధనకు ఇక స్వస్తి.. మహిళా అధికారుల పట్ల సంభాషణలో మార్పు

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారులను ‘సర్’ అని పిలవాలన్న నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆదేశాలను మధ్యంతర ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవల జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలో పనిచేసిన ప్రభుత్వంలో, పురుషులు గానీ మహిళా ఉద్యోగులు గానీ అందర్నీ ‘సర్’ అనే పిలవాలని అధికారికంగా ఆదేశాలు ఉన్నాయి.

హసీనా సుదీర్ఘ పదవీ కాలంలో – దాదాపు 16 సంవత్సరాల పాటు – ఈ పద్ధతి కొనసాగింది. ఈ నిబంధన ప్రకారం మహిళా అధికారులు, మంత్రులు కూడా ‘సర్’ అనే పదంతోనే సంబోధించబడుతుండటం పట్ల, సామాజికంగా, సాంస్కృతికంగా అనుచితమని తాజాగా అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీంతో, ఈ నిబంధనను రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

అంతేకాదు, అధికారులను భవిష్యత్తులో ఎలా సంబోధించాలన్నదానిపై సమగ్రంగా సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎనర్జీ, రోడ్లు, రైల్వేలు, పర్యావరణం, నీటి వనరులపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే ప్రముఖ న్యాయవాది సైదా రిజ్వానా హసన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ, ఒక నెలలోపు నివేదికను అందించాల్సిందిగా ఆదేశించారు.

సలహా మండలి సమావేశంలో ‘సర్’ అనే పదాన్ని మాత్రమే కాకుండా, మరికొన్ని అధికారిక ప్రోటోకాల్ నియమాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని చర్చించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలపై సమీక్ష జరిపి, బంగ్లాదేశ్ పరిపాలనా వ్యవస్థలో మరింత సమర్థవంతమైన, లింగసమానతకు అనుగుణమైన మార్గదర్శకాలను రూపొందించనుంది.

ఈ చర్యతో బంగ్లాదేశ్‌లో లింగ సమానత్వంపై చర్చకు మరింత ఊతం లభించనుంది. మహిళా అధికారులను పురుషులతో సమానంగా కాకుండా, సాంబోధనా ప్రమాణాల్లోనూ తగ్గించేసే ప్రయత్నాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ఈ నిర్ణయం పురోగమనా దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెబుతున్నారు విశ్లేషకులు.

World Population Day : జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలి: సీఎం చంద్రబాబు