Bangladesh : బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, భారత ప్రధాని నరేంద్ర మోడీల భేటీల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఏడు దేశాలతో కూడిన ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (బిమ్‌స్టెక్) కూటమి సమావేశం సందర్భంగా వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఢాకాకు చెందిన అధికారులు భారత విదేశాంగశాఖను సంప్రదించారు. ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయ్‌లాండ్‌లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
Read Also: L2 Empuraan Trailer : పవర్ ఫుల్ మోహన్ లాల్ ‘లూసిఫర్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..
ఇక, ఈ విషయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హోస్సాని ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ..బిమ్‌స్‌టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటుచేయడంపై.. ఇప్పటికే భారత్‌తో దౌత్యపరంగా సంప్రదింపులు జరిపాం అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై ఇటీవల తమ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి హింసనైనా.. మైనార్టీలపై వివక్షను ఖండిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకొన్న చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని తాము గమనిస్తున్నామని.. భవిష్యత్తులో కూడా ఆ దేశం వాటిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.