Bangalore: రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన.. డ్రమ్ లో యువతి కుళ్ళిన శవం!

అదో పెద్ద మహా నగరం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అది ఒకటి. అలాంటి ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Published By: HashtagU Telugu Desk
Parking Space

Parking Space

Bangalore: అదో పెద్ద మహా నగరం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అది ఒకటి. అలాంటి ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారణం లేకపోలేదు. రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ లో ఒక యువతి శవం కనపడింది. అది కూడా ఒక ప్లాస్టిక్ డ్రమ్ లో కనపడింది. కుళ్ళిన స్థితిలో ఉన్న ఆ శవాన్ని చూసి రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు అధికారులు కూడా ఒక్కసారిగా హడలిపోయారు.

ఒక డ్రమ్ లో నుంచి ఏదో దుర్వాసన వస్తుందే అని అందరి దృష్టి అటు వైపు వెళ్ళింది. ఏంటా అని చూస్తే ఒక యువతి శవం కుళ్లిపోయిన స్థితిలో కనపడింది. ఇది జరిగింది ఎక్కడో కాదు విశ్వనగరం స్థాయిలో ఉండే బెంగళూరులో. దీంతో అందరి దృష్టి ఈ విషయం మీద పడింది. అందరూ ఈ విషయం మీదే చర్చించుకుంటున్నారు ప్రస్తుతం.

వివరాల్లోకి వెళితే ఈ సంఘటన జరిగింది బెంగళూరు నగరంలోని యశవంతపురం రైల్వే స్టేషన్‌ లో . ప్రయాణికులు క్లీనింగ్ సిబ్బంది కి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వచ్చి రైల్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రమ్ముని కదిలించగా అక్కడ ఒక యువతి శవం కనిపించింది. అయితే ఆ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

ప్రాథమిక తనిఖీ తరువాత ఆ యువతి వయసు 23 సంవత్సరాలు గా నిర్దారించారు. అయితే ముందుగా ఆ యువతిని చంపి పక్కా ప్లాన్ తోనే ఆ డ్రమ్ లో పడవేసి ఉండవచ్చు అని అంటున్నారు. ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా ఆ డ్రమ్ కి సీల్ వేసి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఆ యువతి ఎవరు ఆమెని ఎవరు చంపి ఉండవచ్చు అని శోధిస్తున్నారు. సంబంధిత పోలీసులు ఈ విషయంలో నిమగ్నం అయి ఉన్నారు. ఒక్కసారిగా యశ్వంతపురం రైల్వే వార్తల్లో నిలిచింది. దొరికిన సాక్ష్యాలను బట్టి పోలీసులు ఈ విషయంలో ముందుకు వెళుతున్నట్టుగా సమాచారం.

  Last Updated: 04 Jan 2023, 10:11 PM IST