Lok Sabha Session 2024 : లోక్​సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్

తెలంగాణలో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్​ రెడ్డి ఎంపీ, కరీంనగర్​ నుంచి గెలుపొందిన బండి సంజయ్​లు ప్రమాణ స్వీకారం చేశారు

Published By: HashtagU Telugu Desk
Bandi Sanjay Kishan Oath

Bandi Sanjay Kishan Oath

పార్లమెంటు సమావేశాలు (Lok Sabha Session 2024) ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి జులై 3వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణం, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికను చేపట్టడం జరుగుతుంది. అలాగే, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. 2014, 2019లో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన బీజేపీకి.. మూడోసారి మాత్రం మిత్రపక్షాల మద్దతు అవసరం తప్పనిసరైంది.

18 వ లోక్ సభలో తొలుత ప్రధాని మోడీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తర్వాత వరసగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్​ రెడ్డి (Kishan Reddy) ఎంపీ, కరీంనగర్​ నుంచి గెలుపొందిన బండి సంజయ్ (Bandi Sanjay)​లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలుగులో తమ ప్రమాణాన్ని చేశారు.

కిషన్​ రెడ్డి, బండి సంజయ్​లకు రాష్ట్రం నుంచి మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్​రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్​లను నియమించింది. రాష్ట్రం నుంచి 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే విశాఖపట్టణం టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఎంపీగా తెలుగులో, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంగ్లీషులో,కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(టీ టైమ్ ఉదయ్) ఆంగ్లంలో , విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగులో ప్రమాణం చేసారు.

Read Also : MLA Sanjay Kumar : ఎమ్మెల్యే సంజయ్​ చేరిక పట్ల జీవన్​ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారా..?

  Last Updated: 24 Jun 2024, 01:08 PM IST