Book Ban: స‌ల్మాన్ ఖుర్షీద్ పుస్త‌కంపై వివాదం, అమిత్‌షాకు రాజాసింగ్ ఘాటు లేఖ‌

స‌ల్మాన్ ఖుర్షీద్ తాజాగా రాసిన పుస్త‌కంపై వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది. తాజాగా ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 10:40 PM IST

స‌ల్మాన్ ఖుర్షీద్ తాజాగా రాసిన పుస్త‌కంపై వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది. తాజాగా ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు. పుస్త‌కంలో రాసిన చాలా వాక్యాలు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేవిధంగా ఉన్నాయ‌ని, ఖుర్షీద్‌పై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో కోరారు.

వివాదాస్ప‌ద అయోధ్య‌పై ఖుర్షీద్ రాసిన 354 పేజీల రాసిన పుస్త‌కంపై చాలామంది నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. హిందుత్వంపై., హిందువుల‌పై త‌ప్పుడు అభిప్రాయం క‌లిగించే విధంగా ఆ పుస్త‌కంలో రాత‌లున్నాయ‌ని రాజాసింగ్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫాల్స్ ప్ర‌చారం చేస్తోంద‌ని ఆరోపించారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని హిందువుల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు ఏనాడు మాట్లాడ‌ని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏం మాట్లాడుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. గ‌త వారం ఈ పుస్త‌కం ముద్ర‌ణ‌ను నిలిపివేయాలంటూ ఢిల్లీ కోర్టు ఇంజంక్ష‌న్ ఆర్డ‌ర్ పాస్ చేసిన విష‌యం తెలిసిందే.