WhatsApp Accounts Ban: ఇండియాలో 36.77 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం

ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం (Banned) విధించింది.

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది.(WhatsApp) భారతదేశంలో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుంచి డిసెంబర్ 31వతేదీ వరకు నెలరోజుల్లో 36,77,000 వాట్పాప్ ఖాతాలను( Indian WhatsApp Accounts) నిషేధిస్తూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం (Banned) విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు (WhatsApp Accounts Banned) వాట్సాప్ తెలిపింది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమలోనే అగ్రగామిగా ఉందని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు. తమకు 1607 మంది వినియోగదారుల నుంచి అప్పీళ్లు వచ్చాయని వాట్పాప్ పేర్కొంది. వాట్పాప్ కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. 2021 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో 53 కోట్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ను వినియోగించే అతి పెద్ద దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని భారత ప్రభుత్వం తెలిపింది

Also Read:  Vande Metro Trains: త్వరలోనే రానున్న వందే భారత్‌ మెట్రో రైళ్లు..!