Site icon HashtagU Telugu

Tragedy : యూపీలో భర్తపై భార్య దారుణం.. భర్త సజీవదహనం

Fire

Fire

Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహ బంధం లోపలే మోసం, ప్రతీకారం, దారుణ హత్యకు దారి తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. భర్త సన్నీని అతని భార్య అంకిత సజీవదహనం చేయగా, ఈ నేరానికి ఆమె ప్రియుడు అయ్యూబ్ అహ్మద్, అంకిత మామ సుశీల్, బేబీ అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాగ్‌పత్ జిల్లా కందేరా గ్రామానికి చెందిన సన్నీకి గడిచిన ఏడాది గఱ్ఱీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో వివాహం జరిగింది. అయితే, సన్నీకి తెలియకుండానే అంకిత ప్రియుడు అయ్యూబ్ అహ్మద్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిందని సమాచారం. ఈ నేపథ్యంలో వివాహానంతరం దాంపత్య జీవితం క్షీణించిందని స్థానికులు చెబుతున్నారు.

Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు

జూలై 22న సన్నీ ‘కావడీ యాత్ర’లో భాగంగా గంగాజలం తీసుకురావడానికి హరిద్వార్ బయలుదేరాడు. అయితే కంగరాన్ గ్రామ సమీపంలో నలుగురు వ్యక్తులు అతని బైక్‌ను ఆపి, అతనిపై దాడి చేశారు. అనంతరం సన్నీని బలవంతంగా అంకిత తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే సన్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

తీవ్రంగా గాయపడిన సన్నీని మొదట మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు అతన్ని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సన్నీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సన్నీ కుటుంబం, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సన్నీ తండ్రి వేద్‌పాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంకిత, అయ్యూబ్ అహ్మద్, సుశీల్, బేబీ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని సమాచారం. దీంతో కందేరా గ్రామస్థులు నిరసనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో బాగ్‌పత్ జిల్లా అంతటా కలకలం రేగింది. వివాహ బంధం ముసుగులో జరిగిన ఈ దారుణానికి కారణాలు, నిజమైన వాస్తవాలు ఏంటో వెలికితీయడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Singapore Tour : గూగుల్‌తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్