Rahul Gandhi:కొత్త వేరియంట్ పై రాహుల్ ట్వీట్‌… మోడీ పై ఫైర్‌

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ పై దేశ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లుగుతుంది. ఈ నేప‌థ్యంలో దేశంలో కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, వ్యాక్సినేష‌న్ ప‌క్రియ పై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష చేశారు.

  • Written By:
  • Updated On - November 27, 2021 / 08:59 PM IST

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ పై దేశ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లుగుతుంది. ఈ నేప‌థ్యంలో దేశంలో కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, వ్యాక్సినేష‌న్ ప‌క్రియ పై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష చేశారు. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుండి వచ్చిన కొత్త కోవిడ్‌ -19 వేరియంట్ ఓమిక్రాన్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేశారు. తాజా వేరియంట్ ని తీవ్ర‌మైన ముప్పుగా ఆయ‌న ప‌రిగ‌ణించారు. వ్యాక్సిన్ గణంకాల వివ‌రాల‌ను కేంద్రం ఎక్కువ కాలం దాచ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 31.19 శాతం మంది అర్హులైన ల‌బ్థిదారులు పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు చూపించే చార్ట్ ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గ‌త వారం రోజుకు స‌గ‌టున‌ 6.8 మిలియ‌న్ల మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు పేర్కొన్నారు.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW) ప్రకారం దేశంలోని అర్హులైన లబ్ధిదారులకు 121 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. వీటిలో గత 24 గంటల్లో 73,58,017 వ్యాక్సిన్లు వేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 134 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించారు. 22.16 కోట్లకు పైగా వ్యాక్సిన్ నిల్వ‌లు ఉన్నాయి. స‌మీక్షా స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఇత‌ర దేశాల నుంచి వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల‌ని ఆయ‌న అధికారుల‌కు తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ ఆధారంగా వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని తెలిపారు.

దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో మొదటిసారిగా కనుగొన్న‌ ఓమిక్రాన్ కోవిడ్-19 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళనకు సంబంధించిన వేరియంట్ గా పేర్కొంది. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో ఈ వేరియంట్ బహుళ ఉత్పరివర్తనలకు లోనవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూఎస్‌, యూకేతో పాటు 27 దేశాలు కోవిడ్-19 వేరియంట్ ప్రభావిత ప్రాంతం నుండి వచ్చే వ్యక్తులపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. భారతదేశం కూడా ఇజ్రాయెల్, హాంకాంగ్‌తో సహా అనేక దేశాల జాబితాను విడుదల చేసింది.