సాయి బాబా (Sai Baba) భక్తులకు ఇది నిజంగానే చేదువార్త. షిర్డీ (Shirdi) సాయిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర లోని షిర్డీలో వచ్చే నెల 1 నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు. ఇక్కడున్న వ్యాపారాలు ఇతర కార్యక్రమాలు నిలిపివేయనున్నారు. షిర్డీలోని ప్రముఖ సాయిబాబా ఆలయం పై ఏర్పడిన వివాదం కారణంగా గ్రామస్థులు వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018లో షిర్డీ (Shirdi) ఆలయ భద్రత పై వచ్చిన పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు డివిజన్ తాజాగా షిర్డీ ఆలయంను నిర్వహిస్తున్న సాయి సంస్థాన్ ను అభిప్రాయం కోరింది.
దీనికి సంస్థాన్ మద్దతు పలకింది. అయితే గ్రామస్థులు స్థానిక వ్యాపారులు (Locals) మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వీరు అఖిలపక్షంతో సమావేశమై మే 1 నుంచి బంద్ పాటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి భద్రతా సమస్యలు ఉన్నాయని ఎప్పటి నుంచో కొందరు మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. దీంతో కొందరు సీఐఎస్ఎఫ్ భద్రతా కల్పించాలని డిమాండ్ చేశారు. షిర్డీ ఆలయానికి (Temple) భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ నిర్వహిస్తుంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటారు. ప్రతి రోజూ బాంబు స్వ్కాడ్ తో తనిఖీ చేస్తూ రక్షణ కల్పిస్తారు. ఈ భద్రతా సరిపోవడం లేదని చాలా మంది చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2018లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే బాంబై హైకోర్టు (High Court) లోని ఔరంగాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంచ్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా అఖిలపక్షం నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.
Also Read: Blast in Jharkhand: మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి