Site icon HashtagU Telugu

Doctors : విమానంలో చిన్నారి ప్రాణాలు కాపాడి కనిపించే దేవుళ్లయ్యారు

Ranchi Delhi Indigo Flight

Ranchi Delhi Indigo Flight

సృష్టిలో మనిషికి రూపం ఇచ్చింది దేవుడైయతే..ఆ మనిషి ఆపద సమయంలో ప్రాణాలు పోసేది మాత్రం డాక్టర్స్. అందుకే వారిని కనిపించే దేవుళ్లు అంటారు. అలాంటి దేవుళ్లు తాజాగా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడి ఆ తల్లిదండ్రుల్లో సంతోషం నింపారు. ఈ ఘటన రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం (IndiGo )లో చోటుచేసుకుంది.

పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారి (Baby)ని తీసుకొని ఓ ఫ్యామిలీ..శనివారం రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణం చేస్తున్నారు. విమానం టేకాఫ్ కాగానే ఆ చిన్నారి శ్వాస (Breathing Trouble) తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఇది గమనించిన విమాన సిబ్బంది..ఎవరైనా డాక్టర్స్ ఉంటె..ఆ పాపను కాపాడాలని కోరారు. దీంతో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న డాక్టర్స్ డా.నితిన్ కులకర్ణి, మొజామిల్ ఫిరోజ్ (Dr Nitin Kulkarni and Dr Mozammil Pheroz) లు తమ వద్ద ఉన్న పరికరాలతో చిన్నారికి కృత్రిమ శ్వాస అందించారు. దీంతో ఆ పాప కాస్త ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేసింది. విమానం ల్యాండైన తర్వాత అధికారులు చిన్నారిని ఎయిమ్స్ కు తరలించారు. ఇక చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు డాక్టర్స్ ను అంత ప్రశంసించారు.

ఈ సందర్భాంగా డాక్టర్ నితిన్ కులకర్ణి మాట్లాడుతూ..” చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం తో ఆ చిన్నారి తల్లి కన్నీరు పెట్టుకుంటుంది..ఈ క్రమంలో నేను , నాతో పాటు మొజామిల్ ఫిరోజ్ ఇద్దరం కలిసి తమ వద్ద ఉన్న చిన్న చిన్న పరికరాలతో ఆ పాప కు ఊపిరి అందేలా చేసాం..ఆ తర్వాత ఆ పాపను ఢిల్లీ ఎయిమ్స్ హాస్పటల్ (Delhi Aiims Hospital) లో చేర్పించాలని” సూచించినట్లు తెలిపారు.