Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్ర‌ముఖ నేత‌..?

బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.

Published By: HashtagU Telugu Desk
Champai Soren

Champai Soren

Champai Soren: ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. జేఎంఎం మాజీ నేత, రాష్ట్ర మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) బీజేపీలో చేరనున్నారు. ఆయన పార్టీలో చేరేందుకు అధికారికంగా ఆగస్టు 30 తేదీని ఖరారు చేశారు. అయితే పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై బాబూలాల్ మరాండీ సంతోషంగా లేరని చెబుతున్నారు. ఈ విషయమై ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారని సమాచారం. మరాండిని సీఎంగా పార్టీ అధిష్టానం చేయవచ్చని, అటువంటి పరిస్థితిలో ఆయన అభిప్రాయమే ముఖ్యమన్న చర్చ కూడా సాగుతోంది.

బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు. మంగళవారం ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల సన్నాహకాలపై చర్చించారు. అయితే ఈ విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నలు అడగగా.. మా పార్టీలోకి వస్తున్నార‌ని, స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.

Also Read: BCCI Secretary: ఐసీసీ చైర్మ‌న్‌గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?

సోరెన్ సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్డీయేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని మరాండీ కోరినట్లు సమాచారం. దీంతో హేమంత్ సోరెన్ కుటుంబానికి కంచుకోటగా భావించే సంతాల్ ప్రాంతంలో గిరిజనుల ఓట్లను చంపై సోరెన్ కోత పెట్టనున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆగస్టు 30న ఆయన అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా రెబల్ సీనియర్ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరాలని నిర్ణయించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్‌లో ధృవీకరించారు. ఇప్పుడు ఆగస్టు 30న చంపై సోరెన్‌తో పాటు జేఎంఎంకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరవచ్చని చర్చ జరుగుతోంది.

  Last Updated: 27 Aug 2024, 11:45 PM IST