Mumbai Terror Attack : 2008 సంవత్సరంలో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాడి గురించి ఇంకా భారతీయులు ఎవరూ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఆ రోజున సాగించిన అరాచక పర్వం ఇంకా అందరి కళ్ల ఎదుట కదలాడుతోంది. ఆ దాడిలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తైబా సీనియర్ కమాండర్ ఆజం చీమా గుండెపోటుతో చనిపోయాడు. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ నగరంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మల్కాన్‌వాలాలో ఆజంకు అంత్యక్రియలు నిర్వహించారు. 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా ఆజమే సూత్రధారి. అంతకుముందు 2006 సంవత్సరంలో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక కూడా ఇతగాడి హస్తం ఉంది. అప్పట్లో ట్రైనులో బాంబు పేలి 188 మంది చనిపోగా, 800 మందికి గాయపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
- పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తైబా ఉగ్రవాదులు 2008 నవంబరు 26న ముంబైలో(Mumbai Terror Attack) మారణహోమానికి తెగబడ్డారు.
- కొలాబా సముద్ర తీరం నుంచి వీరంతా ముంబైలోకి చొరబడ్డారు. ఉగ్రవాదులంతా టీమ్‌లుగా ౌవిడిపోయి అనేక చోట్ల కాల్పులు జరిపారు.
- దాదాపు 60 గంటల పాటు ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 166 మంది చనిపోయారు.
- చనిపోయిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉన్నారు.
- ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆజం చీమా ట్రైనింగ్ ఇచ్చాడని అంటారు.
- అందుకే ఆజం పేరును మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో భారత్ చేర్చింది.
Also Read : Google Vs India Apps : ఆ యాప్స్ డిలీట్.. గూగుల్ ప్లేస్టోర్‌కు కేంద్రం వార్నింగ్.. ఎందుకు ?
సాజిద్ మిర్‌పై విష ప్రయోగం ?
ముంబై 26/11 ఉగ్రదాడుల మాస్టర్ మైండ్, లష్కరే తైబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలిసింది. పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్ సెంట్రల్ జైళ్లో ఉన్న సాజిద్ మిర్ మీద విష ప్రయోగం జరిగినట్లు సమాచారం. డేరా ఘాజీఖాన్ సెంట్రల్ జైళ్లో ఉన్న మిర్ మీద విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI..మిర్‌ను విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బహవాల్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో సాజిద్ మిర్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై మీద పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాజిద్ మిర్ జైళ్లో వంట చేస్తున్న వంటమనిషి పాత్రపైన విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత అతను కనిపించకుండా పోయినట్లు సమాచారం.పాకిస్తానీ అమెరికన్ అయిన దావూద్ గిలానీ అలియాస్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ సాయంతో ముంబై 26/11 ఉగ్రదాడికి సాజిద్ మిర్ ప్లాన్ చేశాడు. అయితే సాజిద్ మిర్ చనిపోయాడంటూ గతంలో నాటకాలు ఆడుతూ వచ్చిన పాకిస్థాన్.. అమెరికా ఒత్తిడితో గతేడాది సాజిద్ మిర్‌ను అదుపులోకి తీసుకుంది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమూద్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా ఉగ్రదాడులకు పాల్పడ్డాడనే కారణంతో 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.