Gulam Nabi Azad : ఆజాద్ వేరుకుంపటి..కొత్త పార్టీకి నేడే ముహూర్తం..!!

కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ghulam nabi azad

Ghulam nabi azad

కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. తన సొంత రాష్ట్రమైన జమ్ముకశ్మీర్ లో ఇవాళ ఆయన పార్టీ తొలి యూనిట్ ను ప్రకటించనున్నారు. 73 ఏళ్ల ఆజాద్ ఇవాళ ఉదయం జమ్ముకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో ఆయన మద్దతుదారులు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి సైనిక్ ఫామ్స్ కు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ఆజాద్ ప్రసంగిస్తారు.

ఈ ర్యాలీకి 20వల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అక్కడే జాతీయ పార్టీని కూడా ప్రకటించనున్నారు. ఇక ఆజాద్ కు సపోర్టుగా జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ యూనిట్లోని పలువురునేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే అశోక్ వర్మ కాంగ్రెస్ అధినేతకు లేఖ రాస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఆజాద్ గూటికి చేరుతారని సమాచారం.

  Last Updated: 04 Sep 2022, 11:02 AM IST