Site icon HashtagU Telugu

First Satellite Picture : అయోధ్య రామాలయం మొదటి శాటిలైట్ ఫొటో ఇదే..

First Satellite Picture Min

First Satellite Picture Min

First Satellite Picture : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇస్రో రంగంలోకి దిగింది. ఇస్రోకు చెందిన  నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) అంతరిక్షం నుంచి స్వదేశీ ఉపగ్రహాల ద్వారా అయోధ్య రామమందిరం ఫొటోను తీసింది. దీనికి సంబంధించిన ఫొటోలో.. అయోధ్యా నగరం నడుమ రామమందిరాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. రామాలయం నమూనా అందులో మనకు కచ్చితమైన ఆకారంలో అందంగా కనిపిస్తుంది. అయోధ్యలోని దశరథ్ మహల్, సరయూ నది,  రైల్వే స్టేషన్లను  కూడా శాటిలైట్ ఇమేజ్‌లలో(First Satellite Picture) చూడొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠించనున్నారు. సాంప్రదాయ నాగర శైలిలో రామాలయాన్ని నిర్మించారు. ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు నుంచి పడమరకు), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఉంది.  ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంది. రామ మందిరంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి.

Also Read: Hand Transplant Surgery : ఇద్దరికి చేతుల మార్పిడి.. ఆపరేషన్లు సక్సెస్