9999 Diamonds : 9999 డైమండ్లతో రామాలయ నమూనా.. పెన్సిల్ కొనపై రాముడి ఫొటో

9999 Diamonds : గుజరాత్‌లోని సూరత్​కు చెందిన ఓ కళాకారుడు క్రియేటివిటీని చాటుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
9999 Diamonds

9999 Diamonds

9999 Diamonds : గుజరాత్‌లోని సూరత్​కు చెందిన ఓ కళాకారుడు క్రియేటివిటీని చాటుకున్నాడు. 9,999 వజ్రాలతో అయోధ్య రామాలయ నమూనా చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో ఆలయం, జై శ్రీరామ్ నినాదం, రాముడి ఫొటో ఉన్నాయి. వజ్రాల కాంతులతో ఆలయం నమూనా(9999 Diamonds) ఫొటో మిరమిట్లు గొలుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

మహారాష్ట్రలోని జైపూర్‌కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​ హోల్డర్ నవరత్న ప్రజాపతి కూడా క్రియేటివిటీని చాటుకున్నారు.  రాముడి ఫొటోను పెన్సిల్ కొనపై చెక్కారు. దీన్ని పూర్తి చేయడానికి ఐదు రోజుల టైం పట్టిందని ఆయన తెలిపారు. పెన్సిల్ కొనపై  రాముడి ఫొటో  1.3 సెంటీమీటర్ల సైజులో ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం ఇదేనన్నారు. దీన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు బహుమతిగా అందించి.. శ్రీరామ్​ మ్యూజియంలో పెట్టేలా ప్రయత్నిస్తానని వెల్లడించారు.

Also Read: Rahul – January 22 : 22న శంకర్‌దేవ్ సన్నిధికి రాహుల్.. ఎవరీ శంకర్‌దేవ్ ?

జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరగబోతోంది. ఈనేపథ్యంలో వారణాసి, మధుర మాదిరిగానే.. అయోధ్య రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు పెట్టి, ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు, అనుమతి ఉన్నవాటిని మాత్రమే ఆదివారం, సోమవారం వరకూ అయోధ్య లో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. అయోధ్యకు దారితీసే ఐదు మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైళ్ల నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్‌ కోడ్‌తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. QR కోడ్‌తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

  Last Updated: 21 Jan 2024, 01:45 PM IST