Site icon HashtagU Telugu

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం ఆహ్వాన లేఖ ఎంతమందికి పంపారంటే ?

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లో నూతనంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు  జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మంది సాధువులకు పోస్టు ద్వారా ఈ ఆహ్వాన లేఖలను పంపామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 600 మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం నాలుగు దశల్లో జరుగుతుంది. ఈ వేడుక కోసం దేశ, విదేశాల్లోని ఎంతోమందిని ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది. వారందరికీ పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లను కూడా పంపించారు. అయితే జనవరి 22న వేడుకలకు హాజరయ్యేందుకు అయోధ్యకు వెళ్లే అతిథులు తమ ఆధార్ కార్డులను తప్పకుండా తీసుకెళ్లాలి. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు.

Also Read: Earthquake : బెంగాల్, లడఖ్‌లో భూప్రకంపనలు.. బంగ్లాదేశ్ భూకంపం ఎఫెక్ట్

అయోధ్యలోని రామ మందిర సముదాయం దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 8 ఎకరాల్లో రామ మందిరం నిర్మిస్తుండగా, ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం మినహా మిగిలిన ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలు నిర్మిస్తున్నారు. నగారా శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయంలో అద్భుతమైన శిల్పాలు ఉపయోగించారు. వాటిని ఆలయం దగ్గరే చెక్కారు. ఆ శిల్ప సంపదను చూసి తీరాల్సిందే. రామ మందిరం రెండో అంతస్తులో దాదాపు 10 అడుగుల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొదటి దశ పనులు దాదాపుగా పూర్తయినప్పటికీ, రెండో అంతస్థులో ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.  అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన  తర్వాత కూడా ఆలయ నిర్మాణ పనులు(Ayodhya Ram Mandir) కొనసాగుతాయి.