Site icon HashtagU Telugu

Ram Lalla With BrahMos : బ్రహ్మోస్ క్షిపణితో అయోధ్య రాముడు.. రిపబ్లిక్ డేలో స్పెషల్ శకటాలు

R Day Celebrations

R Day Celebrations

Ram Lalla With BrahMos : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో  పరేడ్, శకటాల ప్రదర్శనలు కనులవిందుగా జరిగాయి. వివిధ రాష్ట్రాలు వాటి సంప్రదాయాలు,  సంస్కృతిని అద్దంపట్టే శకటాలను ఈసందర్భంగా ప్రదర్శించాయి. జనవరి 26 ప్రసంగంలో అయోధ్య రామమందిరం అంశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ సర్కారు రిపబ్లిక్ డే శకటాల్లోనూ అయోధ్య రామమందిరాన్ని డిస్‌ప్లే చేసింది. వాహనంపై బ్రహ్మోస్ క్షిపణితో నిలబడిన బాలరాముడి మూర్తితో కూడిన శకటం అందరినీ ఆకట్టుకుంది. అందరికీ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించింది. ‘‘అయోధ్య: వికసిత్  సమ్రాధ్ విరాసత్’’ అనే థీమ్‌తో ఉత్తరప్రదేశ్ సర్కారు ఈ శకటాన్ని(Ram Lalla With BrahMos) ప్రదర్శించింది.

ఇక ఇప్పటివరకు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ సర్కారు ‘నారీ శక్తి’ నినాదంతో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంలో మణిపూర్ కల్చర్‌ను అద్దంపట్టే ప్రదర్శన ఇచ్చిన మహిళలంతా.. ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని  ‘ఇమా కీథెల్’ వాణిజ్య సముదాయంలో స్టాల్స్ నడుపుకునే వారే కావడం విశేషం. కేవలం మహిళలే షాపులు నిర్వహించే ‘ఇమా కీథెల్’ వాణిజ్య సముదాయానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

కర్తవ్య పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫ్రాన్స్‌కి చెందిన బ్యాండ్ కూడా పాల్గొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఈసారి రిపబ్లిక్ డేకు భారత అతిథిగా వచ్చినందున.. ఆ దేశానికి చెందిన బ్యాండ్ సైతం వేడుకలకు హాజరైంది. ఇక రెజిమెంట్ పరేడ్ కూడా కనులవిందుగా సాగింది. ఈ పరేడ్‌లో భారత సైన్యం ఆయుధ సంపత్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో  మల్టీ ఫంక్షన్ రాడార్ సిస్టం, డ్రోన్ జామర్ సిస్టం, వెపన్ లొకేటింగ్ రాడార్ సిస్టం, పినాకా యుద్ధ ట్యాంకర్లు, బీఎంపీ 2/2కే ట్యాంకులు, నాగా మిస్సైల్స్ సిస్టం, ట్యాంక్ టీ 90, 61 అశ్విక దళం ఉన్నాయి.

ఆగస్టు 15, జనవరి 26 పతాకావిష్కరణ వేడుకల్లో తేడా ఇదీ

  • ఆగస్ట్ 15న జెండాను కింది నుంచి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది.