Site icon HashtagU Telugu

Ayodhya Airport : అయోధ్య ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు

Ayodhya Airport

Ayodhya Airport

Ayodhya Airport : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో అయోధ్యకు రాకపోకలు సాగించే భక్తజనం సౌకర్యార్ధం అయోధ్య ఎయిర్ పోర్టును ఆధునీకరించారు. అధునాతన వసతులతో పునర్నిర్మించారు. దీన్ని డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ ఎయిర్ పోర్టు పేరును మార్చేసింది. ఇప్పటివరకు అయోధ్య ఎయిర్ పోర్టుకు ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్’ అనే పేరు ఉండేది. ఇకపై దీన్ని ‘మహర్షి వాల్మీకి విమానాశ్రయం’గా పిలువనున్నారు. ఈమేరకు ఎయిర్ పోర్టు పేరును మారుస్తూ అధికారిక ఉత్తర్వు(Ayodhya Airport) జారీ అయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇంతకుముందు వరకు అయోధ్యకు వెళ్లాలని భావించేవారు.. తొలుత లక్నోకు చేరుకొని, అక్కడి నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. నేరుగా ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానంలో చేరుకోవచ్చు. దీనివల్ల ఎంతో సమయం, ఖర్చు ఆదా అవుతాయి.  ఇక డిసెంబరు 30న ప్రధాని మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని కూడా ప్రారంభించనున్నారు.  అయోధ్య రైల్వే స్టేషన్ పేరును కొన్ని రోజుల క్రితమే మార్చేశారు. దీనికి ‘అయోధ్య ధామ్ జంక్షన్‌’ అని పేరు పెట్టారు.

విమాన సర్వీసుల విశేషాలు

  • అయోధ్య ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం డిసెంబర్ 30న ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది.
  • జనవరి 6 నుంచి సాధారణ ప్రయాణికుల కోసం అయోధ్య – ఢిల్లీ మధ్య  విమాన రాకపోకలు ప్రారంభమవుతాయి.
  •  జనవరి 11 నుంచి అయోధ్య –  అహ్మదాబాద్‌ మధ్య  విమానాలు నడవడం ప్రారంభమవుతుంది.
  • జనవరి 15 నుంచి అయోధ్య – ముంబై మధ్య విమాన సర్వీసులు మొదలవుతాయి.
  • తొలి దశలో అయోధ్య నుంచి ఇండిగో విమానయాన సంస్థ  సర్వీసులు అందిస్తుంది.  ఆ తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇతర సంస్థలు కూడా విమాన సర్వీసులను నడపడం మొదలుపెడతాయి.

Also Read: New Year -Banned : న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. ఆ దేశం సంచలన నిర్ణయం