మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారమే ఇంటి నుంచి బయలుదేరి లక్నో చేరుకున్నారు. ఈ రోజు అయోధ్యకు చేరుకునే సమయంలో మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న గొప్ప కార్యానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహా కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఆరాధ్యదైవమైన హనుమంతుడే నన్ను వ్యక్తిగతంగా అయోధ్యకు ఆహ్వానించినట్లు నేను భావిస్తున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి (Chiranjeevi), మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో ‘భోళా శంకర్'(Bholaa Shankar) సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇక భోళా శంకర్ తర్వాత చిరంజీవి.. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ భారీ ఫాంటసీ మూవీని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ మూవీ 2025 సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also : Fire Accident : దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం..దగ్దమైన బస్సులు