Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు మరింత సులభం.. UPIతో Axis క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలో తెలుసుకోండిలా..!

యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా UPI సేవను భారతదేశంలో ప్రారంభించిన ఆరవ బ్యాంక్‌గా అవతరించింది.

  • Written By:
  • Updated On - May 13, 2023 / 09:34 PM IST

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా UPI సేవను భారతదేశంలో ప్రారంభించిన ఆరవ బ్యాంక్‌గా అవతరించింది. ఇంతకుముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ ఈ సేవను ప్రారంభించాయి. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. కస్టమర్‌లు ఇప్పుడు తమ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా UPI లావాదేవీలు చేయవచ్చు. దీని కోసం వారు తమ క్రెడిట్ కార్డ్‌ను UPI యాప్‌తో లింక్ చేయాలి. చివరి ఆరు అంకెలు, గడువు తేదీని నమోదు చేయడం ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయవచ్చు.

UPIతో Axis Rupay క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి..?

– మీరు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని థర్డ్ పార్టీ UPI యాప్ (BHIM, Paytm, Mobikwik)తో లింక్ చేయాలి. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ UPI సదుపాయం ఈ థర్డ్ పార్టీ యాప్‌లలో పని చేస్తుంది.
– ముందుగా ఈ యాప్‌లను గూగుల్ లేదా యాపిల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
– ఆపై మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి. UPI యాప్‌లో నమోదు చేసుకోండి.
– ఆ తర్వాత యాడ్ క్రెడిట్ కార్డ్ అండ్ లింక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంకుకు చెందినదో ఎంచుకోండి.
– ఆ తర్వాత కన్ఫర్మ్‌పై క్లిక్ చేసి, జనరేట్ UPI పిన్‌పై క్లిక్ చేయండి.
– ఆపై మీ క్రెడిట్ కార్డ్‌లోని చివరి ఆరు అంకెలతో పాటు గడువు తేదీని పూరించండి.
– దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి OTP వస్తుంది.
– మీరు పిన్‌ను నమోదు చేయడం ద్వారా దాన్ని సెట్ చేయవచ్చు.

Also Read: Business Ideas: ఈ వ్యాపారానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం.. లాభం మాత్రం భారీగా..!

చెల్లింపు ఎలా చేయవచ్చు..?

– మీరు చెల్లించాలనుకుంటున్న వ్యక్తి QR కోడ్‌ని స్కాన్ చేసి, చెల్లింపు విభాగంలో UPI IDని నమోదు చేయండి.
– దీని తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయండి.
– ఆ తర్వాత Axis RuPay కార్డ్‌ని ఎంచుకోండి.
– తర్వాత UPI పిన్‌ని నమోదు చేసి, కన్ఫర్మ్‌పై క్లిక్ చేయండి.
– దీని తర్వాత మీ చెల్లింపు విజయవంతమవుతుంది.