Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించాల్సిన ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఆకాశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ప్రయోగాన్ని జూన్ 10 నుంచి జూన్ 11కు మార్చినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెల్లడించింది. తమ అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయం తెలియజేసింది. తాజాగా ప్రయోగాన్ని జూన్ 11 సాయంత్రం 5:30 గంటలకు చేపట్టనున్నారు.
ఈ మిషన్‌లో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కీలక పాత్ర పోషించనున్నారు. ఆయనతో పాటు అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్, హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ పాల్గొననున్నారు. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన ఈ మిషన్ 14 రోజుల పాటు ఉంటుంది.
ఆక్సియం-4 మిషన్‌లో మొత్తం 60 ప్రయోగాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏడు ప్రయోగాలను ఇస్రో ప్రత్యేకంగా రూపొందించగా, మరికొన్ని ప్రయోగాల్లో శుభాన్షు శుక్లా నాసా మానవ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పాల్గొననున్నారు. అదనంగా, నాసా నిర్వహించే ఐదు సహకార అధ్యయనాల్లో కూడా శుక్లా పాల్గొననున్నారు. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రీయ రంగంలోకి భారతీయ వ్యోమగాముల వంతు పాత్ర మరింత బలపడనుంది. భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ఇది గర్వకారణమైన మరొక అధ్యాయంగా నిలవనుంది.
Nicholas Pooran : 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నికోలస్ పూరన్