Site icon HashtagU Telugu

Desi Entry : ఆటో నడుపుతున్న ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్.. ఎందుకు ?

Desi Entry

Desi Entry

Desi Entry : పక్కా దేశీ ఎంట్రీ అంటే ఇదే.. !! నికోలస్ మెక్‌కాఫ్రీ.. ఈయన  ఇండియాకు  ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్. ఢిల్లీలోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయంలోకి ఆయన ఆటోలో ఎంట్రీ(Desi Entry) ఇచ్చారు. భారత జాతీయ పతాకం రంగులున్న ఆటోను నికోలస్ మెక్‌కాఫ్రీ.. ఆస్ట్రేలియా ఎంబసీ గేటు నుంచి ప్రవేశ ద్వారం వరకు నడిపారు.  అనంతరం ఆటో నుంచి దిగి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’ అని అక్కడున్న వారికి అభివాదం చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ నేతృత్వంలో తమ దేశ బృందంతో కలిసి పని చేస్తానని నికోలస్ మెక్‌కాఫ్రీ చెప్పారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ పని చేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్‌)లో ఒక పోస్ట్‌ చేశారు. తాను ఆటో నడిపిన వీడియో క్లిప్‌ను ఆ పోస్టులో షేర్‌ చేశారు. మరోవైపు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇప్పటికే మన దేశంలోని వారణాసి, జైపూర్, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాలను ఇప్పటికే సందర్శించారు. విభిన్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించిన అనుభవాలను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

Also Read: 1st Flight To Ayodhya : ఇండిగో పైలట్ ‘జై శ్రీరామ్’ నినాదం.. అయోధ్యకు బయలుదేరిన తొలి విమానం