Vaccine : కోవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ఓకే!

కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.

  • Written By:
  • Updated On - November 2, 2021 / 11:19 AM IST

కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు. కొవిడ్ బారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మొదటి డోస్ కంప్లీట్ అయ్యినవాళ్లు రెండు డోసు కోసం.. ఇంకా ఫస్ట్ డోసు కూడా తీసుకోనివాళ్లు ప్రభుత్వాల ఆదేశాల మేరకు టీకా వేయించుకుంటున్నారు.

అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక్కో దేశం ఒక్కో వ్యవహరిస్తోంది. కొన్ని దేశాలు స్పుత్నిక్ లాంటి టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపితే, మరికొన్ని కోవాగ్జిన్, కోవిష్టీల్డ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. అంతేకాదు.. ఆయా దేశాల ప్రభుత్వాలు ఏ టీకా ను గుర్తింపును ఇస్తాయో.. విదేశీయులు కూడా అదే టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా దేశాలు విదేశీ ప్రయాణాలను చాలా కఠినతరం చేశాయి కూడా. తమ దేశం గుర్తింపు ఇచ్చిన టీకానే తీసుకోవాలని కఠిన రూల్స్ అమలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాజ్జిన్ టీకా కే ఓకే చెప్పింది. కోవాగ్జిన్ తీసుకున్నవాళ్లు తమదేశంలోకి అడుగుపెట్టొచ్చని స్పస్టం చేసింది. గత నెలలో ప్రయాణ ప్రయోజనాల కోసం ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారుచేసిన కోవిషీల్డ్ ను ఆస్ట్రేలియా గుర్తించింది. విదేశీ ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేస్తూ, తాజాగా కోవాగ్జిన్ ను జాబితాలో చేర్చింది. ఈ తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య రాకపోకలు పెరగనున్నాయి. వాణిజ్య అంశాలు కూడా మరింత మెరుగుపడనున్నాయి.