Murder : నోయిడాలో దారుణం.. ఆయుర్వేద డాక్ట‌ర్ కూతురు దారుణ హ‌త్య‌

నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. ఆయుర్వేద వైద్యుడి కుమార్తెను ఓ దుండ‌గుడు ఇంట్లోకి చొర‌బ‌డి హత్య చేశాడు. ఇంటి

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 07:38 AM IST

నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. ఆయుర్వేద వైద్యుడి కుమార్తెను ఓ దుండ‌గుడు ఇంట్లోకి చొర‌బ‌డి హత్య చేశాడు. ఇంటి నుంచి నగదు, నగలు దోచుకెళ్లాడు. ఈ కేసులో నోయిడా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రదీప్ విశ్వాస్ ఆయుర్వేద వైద్యుడి కుటుంబానికి చాలా సుపరిచితుడని, ఆయుర్వేద వైద్యుడు సుదర్శన్ బైరాగి ఇంటికి తరచూ వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసు కస్టడీ నుంచి పోలీసు సర్వీస్ పిస్టల్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రతీకార కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని సెంట్ర‌ల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

ఇంట్లో సుమారు రూ. 25 లక్షల నగదు చోరీకి గురైనట్లు ప్రాథమిక సమాచారం అందిందని, అయితే ఆ తర్వాత నిందితుడి నుంచి రూ. 7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగినప్పుడు వైద్యుడు కుమార్తె శిల్పి (14) ఒంటరిగా ఉందని.. కుటుంబసభ్యులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి మెడకు గుడ్డ కట్టి, నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో ఆమె మృతదేహం మంచంపై కనిపించిందని పోలీసులు తెలిపారు.
కుటుంబ‌స‌భ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామ‌ని డీసీపీ తెలిపారు.

ఆయుర్వేద డాక్ట‌ర్ ఇటీవల ఒక ఫ్లాట్ అమ్మి సుమారు రూ. 7.5 లక్షల నగదు పొందాడని.. ఆ విషయం విశ్వాస్‌కు తెలుసని పోలీసులు తెలిపారు. డాక్ట‌ర్ సుదర్శన్ బైరాగి, ఆయ‌న భార్య ఇద్ద‌రు బ‌య‌టికి వెళ్లిన విష‌యం తెలుసుకున్న నిందితుడు విశ్వాస్ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న డాక్ట‌ర్ కుమార్తె శిల్పి తలుపు తీసి విశ్వాస్‌కి తాగడానికి నీళ్ళు ఇచ్చింది. ఆ తర్వాత నగదు, నగలు ఉన్న చోటికి తీసుకెళ్లమని బాలికను బెదిరించి.. ఆ బాలిక తల్లిదండ్రులకు తన పేరు చెబుతుందనే భయంతో గొంతుకోసి హత్య చేశాడ‌ని పోలీసుల తెలిపారు. నిందితుడిని విచారించిన అనంతరం పోలీసు బృందం అతని ఇంటికి వెళ్లి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.