Arpita Mukherjee: అర్పిత ముఖర్జీ నివాసంలో మాయమైన లగ్జరీ కార్లు.. వైరల్ అవుతున్న న్యూస్?

బెంగాల్ లో టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా జరిగిన కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో పెద్ద ఎత్తున ఈడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.

  • Written By:
  • Updated On - July 30, 2022 / 10:39 AM IST

బెంగాల్ లో టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా జరిగిన కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో పెద్ద ఎత్తున ఈడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈడీ అధికారుల సోదాలలో భాగంగా ఏకంగా ఈమె ఇంట్లో 50 కోట్ల రూపాయల నగదు అలాగే పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఇలా రెండు సార్లు ఈడి అధికారులు ఈమె ఇంట్లో సోదాలు నిర్వహించి ఈమెపై చర్యలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ కుంభకోణంలో ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీతో పాటు మంత్రి పార్థ చటర్జీని కూడా అరెస్టు చేసి ఆగస్టు మూడవ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఇలా ఈమె అరెస్ట్ కావడంతో కోల్కతాలోని డైమండ్ సిటీ కాంప్లెక్స్‌లోని ఆమె నివాసంలో నాలుగు లగ్జరీ కార్లు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలో ఉన్న ఈ నాలుగు కార్లు ఏమయ్యాయని అధికారులు ఆరాతీస్తున్నారు.

ఇక ఈమె ఇంటిలో పార్కింగ్ చేసిన ఆ ఖరీదైన నాలుగు కార్లు గురించి పోలీసుల విచారణ జరుపుతూ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ కార్లు మాయం కావడానికి ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పార్థ చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. కాగా ఈ కుంభకోణం బయటపడటంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అతనిని మంత్రి పదవి నుంచి తొలగించారు.