పల్లెలు, పట్టణాలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా సామాజిక కట్టుబాట్లు మాత్రం తీవ్రంగా పట్టిపీడిస్తున్నాయి. వివాహ వేడుకలో ఆహారాన్ని ముట్టుకున్నందుకు 18 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh)లో గొండా జిల్లాలోని వజీర్‌గంజ్‌లో జరిగింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నౌబస్తా గ్రామానికి చెందిన రేణు మాట్లాడుతూ.. తన 18 ఏళ్ల తమ్ముడు లల్లా (Dalit Young boy) గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడని, సందీప్ పాండే ఇంట్లో దావత్ జరిగిందని తెలిపారు. లల్లా భోజనం చేసేందుకు ప్లేట్‌ను తీసుకున్న వెంటనే, సందీప్, అతని సోదరులు బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. యువకుడి బైక్ ను ధ్వంసం చేశాడు.
‘‘విషయం గురించి గ్రామపెద్దలకు తెలియజేశాం. అయితే నిందితులు కంప్లైట్ చేశారనే ఫిర్యాదుతో మా ఇంట్లోకి చొరబడి లల్లాను మళ్లీ కొట్టారు’’ అని యువకుడి (Dalit Young boy) సోదరి రేణు తెలిపింది. ఏఎస్పీ గోండా శివ రాజ్ మాట్లాడుతూ.. నిందితులు సందీప్ పాండే, అమ్రేష్ పాండే, శ్రవణ్, సౌరభ్, అజిత్, విమల్, అశోక్‌లను అదుపులోకి తీసుకున్నాం. ప్రాణాలకు లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. దళిత యువకుడ్ని కొట్టిన సంఘటన ప్రస్తుతం యూపీలో చర్చనీయాంశమవుతోంది.
Also Read: College Bus Accident: నర్సింగ్ కళాశాల బస్సు బోల్తా.. 15 మంది విద్యార్థినులకు గాయాలు!